4 July, 2026 | 10:27 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

టార్గెట్ కేటీఆర్?

30-05-2025 02:17 AM
  1. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు ఆయన్ను ఉద్దేశించేనా..?
  2. గులాబీ పార్టీలో ముదిరిన అన్నాచెల్లెళ్ల పంచాయితీ

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో మొదలైన చిచ్చు కాస్త కారు పార్టీలో కార్చిచ్చులాగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా కవిత మరోసారి తన వ్యాఖ్యలతో అటు సొంత పార్టీలో, ఇటు రాజకీయవర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించారు. గురువారం మీడియాతో చిట్‌చాట్‌లో ఆమె వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్‌పై అచంచలమైన విశ్వాసాన్ని, గౌరవాన్ని ప్రదర్శిస్తూనే ఆమె తన వ్యాఖ్యలను పార్టీలోని ఇతర అగ్రనేతలపైనా చేసినట్లు తెలు స్తోంది. ప్రధానంగా కవిత తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగానే చాలా కామెంట్లు చేశారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ నాయకత్వంలో తప్ప ఇంకె వరి నాయకత్వం అంగీకరించనన్న కామెం ట్లు దానిలో భాగమే అంటున్నారు. కొంత కాలంగా కేటీఆర్‌తో ఆమెకు విభేదాలు పొడసూపినట్లుగా ఉందని అంటున్నారు.

కేసీఆర్ కు విచారణ కమిషన్ నోటీసులు అందితే రోడ్డెక్కి నిరసనలు తెలపాల్సింది పోయి ఎక్స్‌లో ట్వీట్లు చేస్తారా అని చేసిన వ్యాఖ్యల వెనక కూడా కేటీఆర్ లక్ష్యంగానే చేసినట్లుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నిజామాబాద్‌లో ఎంపీగా తాను ఓడిపోవడానికి సొంత పార్టీవారే కారణమని చెప్ప డంతో ఆమెను ఓడించేందుకు ఎవరు పనిచేశారన్న చర్చలు జరుగుతున్నాయి. అయితే కవిత ఏం ఆశించి సంచలన కామెంట్లు చేస్తున్నారో రానున్న రోజల్లో స్పష్టత వచ్చే అవకాశముంది.

కవితపైన సస్పెన్షన్ వేటుపడొచ్చన్న వార్తలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. మీడియాతో చిట్‌చాట్ చేస్తే షోకాజ్ నోటీసులు, క్రమశిక్షణా చర్యలు తీసుకోలేమన్నారు. కాగా, అంతర్గత పోరు కాస్తా బయటపడటంతో గులాబీ పార్టీలో అన్నాచెల్లెళ్ల పంచాయితీ రానున్న రోజల్లో ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.