1 May, 2026 | 3:38 AM

ట్రంప్‌నకు గుండెపోటే!

01-05-2026 01:45 AM

శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో దాడిచేస్తాం..

చివరి రక్తపుబొట్టు వరకూ పోరాడి ప్రతీకారం తీర్చుకుంటాం

ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ

ఆ కొత్త ఆయుధం ‘హూట్’ సూపర్ టార్పెడోనేనా!?

వాషింగ్టన్, ఏప్రిల్ 30: అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రమవుతోన్నాయి. ఈ క్రమంలో ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారమ్ ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. శత్రు బలగాలపై త్వరలోనే కొత్త ఆయుధంతో విరుచుకుపడనున్నట్లు తెలిపా రు. ఆ ఆయుదం అమెరికాను తీవ్రంగా భయపెడుతుందని హెచ్చరించారు. ఓడరేవుల దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే.. హోర్ముజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ చేసిన ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించారు. ఈ క్రమంలో ఇరాన్ నుంచి తాజా హెచ్చరిక లు వచ్చాయి.

అతిత్వరలో శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తాం. అది వారిని తీవ్రంగా భయపెట్టనుంది. అది వారి పక్కనే ఉంది. దానితో వారికి గుండెపోటు కూడా రావొచ్చు’ అని షారమ్ ఇరానీ పేర్కొన్నారు. అయితే, ఆ ఆయుధం ఏంటి అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టంగా వెల్లడించలేదు. హోర్ముజ్‌ను దిగ్బంధించి.. ఇరాన్‌ను ఆర్థికం గా ఇబ్బందులకు గురిచేసి, చర్చలకు తీసుకురావాలనే అమెరికా వ్యూహాన్ని ఆయన కొట్టి పారేశారు. అమెరికాకు చెందిన విమాన వాహ క నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్‌పై తమ దళాలు దాదాపు ఏడు క్షిపణులతో విరుచుకుపడ్డాయన్నారు.

దీంతో అది కొన్ని రోజులు కార్యకలాపాలను నిర్వహించలేకపోయిందన్నా రు. అమెరికా దిగ్బంధనం ఉన్నప్పటికీ.. నౌక లు కొన్ని తమ ఓడరేవుల నుంచి వెళ్తున్నాయ ని, మరికొన్ని వాటి గమ్యస్థానాలకు కూడా చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. శత్రువులు పశ్చాత్తాపం చెందేవరకు వారిని దెబ్బ కొడతామన్నారు.

ఇదిలా ఉంటే తమ శత్రువులకు ‘గుండెపో టు’ తెప్పించగల ఒక కొత్త ఆయుధాన్ని ఆవిష్కరించనున్నట్లు ఇరాన్ పేర్కొంది. క్షణాల్లో యుద్ధనౌకలను ముక్కలు చేయగల ఆ ఆయు ద్ధం ‘హూట్’ సూపర్ టార్పెడో అయి ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బుల్లెట్లా ప్రయాణిస్తూ, శత్రు యుద్ధనౌకలను, జలాంతర్గాములను ముక్కలు చేయగల ఒక నీటి అడుగున సూపర్- వెపనే ‘హూట్’ అని, దాన్నే గురువారం ఇరాన్ సూచించిన రహస్య ఆయుధం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఇరాన్ అమెరికాకు చేసిన తాజా హెచ్చరికలతో ఆ ఆయుధం ‘హూట్’ అని తీవ్రమైన ఊహాగానాలకు దారితీసింది. ఇరాన్ నావికాదళ కమాండర్ షహ్రామ్ ఇరానీ బహుశా ‘హూట్’ రాకెట్ టార్పెడో గురించి సూచిస్తూ ఉండవచ్చని రక్షణ నిపుణుడు సందీప్ ఉన్నిథాన్ పేర్కొన్నారు. దీనిని సుమారు 2006లో మొదటిసారిగా రహస్యంగా ఇరాన్ పరీక్షించింది. ఇరాన్ దీని వివరాలను గోప్యంగా ఉంచినందున ‘హూట్’ గురించి పెద్దగా తెలియదు. పర్షియన్ భాషలో ‘హూట్’ అంటే తిమింగలం అని అర్థం. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నీటి అడుగున ఆయుధాలలో ఒకటి అని ఇరాన్ పేర్కొంది.

నిజానికి, రష్యా తర్వాత సూపర్-కావిటేటింగ్ టార్పెడో అని పిలవబడే ఆయుధాన్ని కలిగి ఉన్న రెండో దేశం ఇరాన్ మాత్రమే. నీటి అడుగున ప్రయోగించే గైడెడ్ క్షిపణుల వంటి సాంప్రదాయ టార్పెడోలు గంటకు 60- కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటాయి. అయితే, తమ ‘హూట్’ క్షిపణి నీటి అడుగున 360 కిలోమీటర్లకు పైగా వేగాన్ని అందుకోగలదని ఇరాన్ వాదిస్తోంది.