18 April, 2026 | 3:25 AM

విత్తన షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ అధికారుల తనిఖీలు

29-05-2025 10:24 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): విత్తన షాపుల్లో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు(Task Force officials) గురువారం తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన అధికారులు మహబూబాబాద్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఎరువులు విత్తనాలు షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. రైతులను మోసగించే ఎటువంటి చర్యలను కూడా ఉపేక్షించేది లేదని అధికారులు షాపుల నిర్వాహకులకు యజమానులకు హెచ్చరికలు జారీ చేశారు. షాపుల్లో విక్రయానికి సిద్ధంగా ఉన్న విత్తనాలను పరిశీలించారు.