22 April, 2026 | 9:52 PM

ధర్మమే గెలిచింది: తాతా మధు

22-04-2026 08:47 PM

ప్రభుత్వ ఏకపక్ష వైఖరికి హైకోర్టు బ్రేక్..

ఖమ్మంలో మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్న బిఆర్ఎస్ నాయకులు

పీసీ ఘోష్ కమిషన్‌పై స్టే పట్ల తాతా మధుసూదన్ హర్షం

జిల్లా కార్యాలయంలో పండుగ వాతావరణం

ఖమ్మం,(విజయక్రాంతి): పీసీ ఘోష్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టు స్టే విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో కమిషన్ నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు లేదా తదుపరి విచారణ చేపట్టాలనుకున్న ప్రభుత్వ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ (జిల్లా పార్టీ కార్యాలయం) ఎదుట పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ సంబరాలు నిర్వహించారు. న్యాయమే గెలిచిందని హర్షం వ్యక్తం చేస్తూ, నాయకులు మరియు కార్యకర్తలు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.