calender_icon.png 19 July, 2025 | 1:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్త్ భారత్ కార్యక్రమంలో టీబీ పరీక్షలు

18-07-2025 11:00:53 PM

కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో డాక్టర్ అభినవ్ నేతృత్వంలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా టీబి పరీక్షలు నిర్వహించారు. ఉప కేంద్రాలైన కన్నాయిగూడెం, రాజన్నపేట పరిధి గ్రామాల్లో దగ్గు, జ్వర లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. అవసరమైన రోగులను ఎక్స్రే కోసం 102 వాహనంలో ఏటూరునాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.