ప్రతిష్టాత్మకంగా టీడీపీ ప్రజాపథం
- సికింద్రాబాద్ తెదేపా ఇంచార్జి వల్లారపు శ్రీనివాస్ కుమార్
- ముఖ్య అతిధులుగా మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పోలంపల్లి అశోక్, శ్రీపతి సతీష్ జీ.వీ.జీ నాయుడు, నల్లెల కిశోర్
సికింద్రాబాద్, జూలై 12 (విజయక్రాంతి): సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్ లోని పార్సీగుట్ట ప్రాంతంలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా టిడిపి చేపట్టిన ప్రజాపదం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.బౌద్ధనగర్ డివిజన్ అధ్యక్షుడు గరిగె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ తెదేపా ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ సారధ్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, పోలంపల్లి అశోక్, శ్రీపతి సతీష్ జీ వీ జీ నాయుడు, నల్లెల కిశోర్ లు ముఖ్య అతిదులుగా హాజరైయ్యారు.ముందుగా సికింద్రాబాద్ తెదేపా ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ తెదేపా జండాను పార్సీగుట్టలో ఆవిష్కరించారు.
అనంతరం పార్సీగుట్ట చౌరస్తా నుండి పెద్దఎత్తున హాజరైన తెదేపా నాయకులు నాయకురాళ్లతో కలిసి న్యూ అశోక్ నగర్ బస్తీలో ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టిందే ప్రజలకొరకు ప్రజలయొక్క ప్రగతికొరకని, ప్రజల అభ్యున్నతికోసం వారి సమస్యలపై అలుపెరగని పోరాటం చేసేందుకు ముందుంటామని అన్నారు. ఈ పాదయాత్రలో ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, ప్రైవేట్ స్కూళ్లలో ఫీసులమోతపై మరియు రోడ్లు తవ్వి వారాలు గడుస్తున్నా కొత్తరోడ్లు వేయకపోవడంపై ఫిర్యాదులు అందాయని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని వల్లారపు శ్రీనివాస్ కుమార్ తెలిపారు.
ఈకార్యక్రమంలో బాలరాజ్ గౌడ్, కూన శ్రవణ్, తడక వినోద్, కాత విజయ్,జగదీష్ , కొమరయ్య,వెంకట స్వామి జీ,ఎం రమేష్,సాంబ, పిట్ల శంకర్ ముదిరాజ్, పొట్టి శ్రీను, చంద్రమోహన్, శ్రీను యాదవ్, కట్ట రాములు, బోసు, చిరంజీవిరాజు, శశిరేఖ,సరస్వతి, చందర్ ముదిరాజ్, సుదర్శన్ రెడ్డి, డెంటల్ ప్రవీణ్, పుప్పాల విజయ్, భానుప్రకాష్, నర్సింహా, మార్టిన్, మహేందర్, సత్యనారాయణ, వెంకటేష్, బాలకృష్ణ, శామ్, రవి, నర్సింగ్, పూజ, వివేక్, ప్రసాదరావు, మురళి, టైలర్ శ్రీను, వీర శ్రీనివాస్, రమేష్, యాదగిరి, అబ్దు, ఆనంద్, కిరణ్, యుగంధర్, ప్రకాష్, అనిల్,శక్తి ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.






