calender_icon.png 16 November, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు రహిత సమాజం కోసం ఉపాధ్యాయుడి జనచైతన్యం

16-11-2025 05:21:29 PM

చివ్వెంల: చివ్వెంల మండల కేంద్రంలోని ఐకెపి సెంటర్‌లో ఈరోజు గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల ప్రమాదాలను తెలియజేస్తూ వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్దిరాల మండలం గోరంట్ల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని నడిపించారు. యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలకు, రైతులకు, హమాలీలకు సందేశాలతో చైతన్యం కల్పించారు.

సెలవు దినాలను సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జాతరలు, ఉత్సవాలు, వారాంత సంతలు, రద్దీ ప్రాంతాలలో “నో డ్రగ్స్ – సేవ్ లైఫ్” అనే నినాదంతో తన సేవలను అందిస్తున్న ప్రభాకర్, విచిత్ర వేషధారణలో మైకు పట్టుకుని, ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ, కరపత్రాలు పంచుతూ ఐకెపి సెంటర్ అంతా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా యువత లక్ష్యాలను ఏర్పరుచుకుని ప్రణాళికబద్ధంగా కష్టపడాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు. “ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం” అనే సందేశంతో మత్తు రహిత సమాజ స్థాపన కోసం తన వంతు కృషి చేయాలని ప్రజలను కోరారు. ప్రభాకర్ నిర్వహించిన ఈ అవగాహన యాత్ర స్థానికుల ప్రశంసలను పొందింది.