16-11-2025 06:17:37 PM
నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి సతీమణి మంజుల పుట్టినరోజు సందర్భంగా మండలంలోని తాండూరు గ్రామంలో గల మంజీర నది ఒడ్డున వెలసిన మహిమాన్విత శైవక్షేత్రమైన త్రిలింగ రామేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకున్నట్లు అయ్యప్ప గురుస్వామి లక్నవరం భీమ్ రెడ్డి స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మల్లికార్జునప్ప, ఆలయ కమిటి అధ్యక్షులు కొమ్మ దత్తు, శ్రీధర్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డి, సిద్దిరాములు, వంశీకృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.