16-11-2025 06:15:29 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేలు గ్రామానికి చెందిన వీరమల్ల వెంకటేష్ వృత్తిరీత్యా కల్లుబండి నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం జరిగిన యాక్సిడెంట్ లో కాలు విరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఇఎల్వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ తక్షణమే స్పందించి వైద్య ఖర్చుల నిమిత్తం బాధిత కుటుంబానికి 30000 రూపాయలను ఫౌండేషన్ డైరెక్టర్ అశోక్ చేతులమీదుగా అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇఎల్వి భాస్కర్ ఫౌండేషన్ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.