16-11-2025 06:35:22 PM
కోదాడ ప్రాంత అభివృద్ధికి సహకారం అందిస్తాం... మంత్రి తుమ్మల తనయుడు తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్ధన్
కోదాడ: సమాజ చైతన్యానికి కమ్మ కులస్తులు బాసటగా నిలవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్, మాజీ ఎమ్మెల్సీ తొండాపు దశరథ జనార్దన్ రావులు అన్నారు. ఆదివారం కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట ఎర్నేని బాబు మామిడి తోటలో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కమ్మ కులస్తులు అన్ని రంగాల్లో రాణించి కమ్మ కులానికి వన్నె తేవాలన్నారు.
కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్నేని బాబు మాట్లాడుతూ ప్రతి ఏడాది కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యం లో కార్తీక మాస వనభోజనాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తురన్నారు. అధ్యకుడు ఎర్నేని బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాజీ డిసిసిబి చైర్మన్ ముతవరపు పాండురంగారావు, డాక్టర్ సుబ్బారావు ,డాక్టర్ రామారావు డాక్టర్ లక్ష్మీప్రసాద్, డి.ఎస్.పి కృష్ణ ప్రసాద్ ముత్తినేని సైదేశ్వరరావు పాల్గొన్నారు.