16-11-2025 06:27:40 PM
జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యడు చిట్టిమల్ల సమ్మయ్య..
మంగపేట (విజయక్రాంతి): ములుగు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు ములుగు నియోజకవర్గం ఇన్చార్జి జనగాం రవీందర్ అధ్యక్షతన, హలో మాల-చలో ఢిల్లీ కార్యాక్రమానికి ములుగు జిల్లా ఇంచార్జి రాష్ట్ర అధికార ప్రతినిధి నీరటి రాములు, రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ జాతీయ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో నవంబర్ 26న రాజ్యాంగ హక్కుల సాధన కోసం "ఛలో ఢిల్లీ" కి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది.
జాతీయ మాల మానాడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ బ్యూరో సభ్యుడు చిట్టిమల్ల సమ్మయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదంలోకి వచ్చిన రోజు నవంబర్ 26 రోజే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాజ్యాంగ హక్కుల సాధన సభ జరపడం జరుగుతుందని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలోని పౌరులకు హక్కులు మరియు దేశ ప్రజలందరికీ, ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యాన్ని ఏర్పరచుకునే అవకాశాన్ని కల్గించిన మహోన్నత నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలలోనే ఎక్కడ లేని విధంగా, మహిళలకు,పురుషులతో సమాణమైన హక్కులను కల్పించిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్, ఈ దేశానికి సుస్థిర మహోత్తర రాజ్యాంగాన్ని అందిస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలైనా పాలకులు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసే విధంగా దళితులపై దాడులు వారి హక్కులకు భంగం కల్పిస్తూ పాల్పడుతున్నారు. ఉదాహరణకి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గావాయ్ పై సుప్రీం కోర్ట్ లోనే మతోన్మాద లాయర్ షూ విసరడం ఒక దేశ అత్యున్నత పదవిలో ఉన్న దళితులకే ఈ పరిస్థితి ఉంటే ఇక దేశంలో ఉన్న సామాన్య దళితుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు.