calender_icon.png 16 November, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సత్యసాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

16-11-2025 06:01:21 PM

నకిరేకల్ (విజయక్రాంతి): సత్య సాయి బాబా శతజయంతి ఉత్సవాలలో భాగంగా సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ శంకర కంటి ఆసుపత్రి సహకారంతో ఆదివారం స్థానిక సత్యసాయి దేవాలయ ఆవరణలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 84 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 23 మందిని శస్త్ర చికిత్సకు ఎంపిక చేశారు. వారిని హైదరాబాద్ శంకరా కంటి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది, సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.