calender_icon.png 19 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇష్టారాజ్యంగా టీచర్లు!?

19-11-2025 12:00:00 AM

- మూతపడ్డ సర్కారు బడి

- మరిపెడ మండలంలోదుస్థితి

మరిపెడ, నవంబర్ 18(విజయక్రాంతి); మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లో వివిధ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విధుల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడం వల్ల పా ఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.

కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడం, మరికొందరు విధులకు వచ్చి, సమయపాలన ముగిసేంతవరకు విధులు నిర్వహించ కుండా మధ్యలోనే పాఠశాలను వదిలేయ డం వల్ల విద్యా బోధన సక్రమంగా జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. మంగళవా రం మరిపెడ మండలంలోని వెంకంపాడు యుపిఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తు న్న ఇద్దరు పాఠశాల టీచర్లు సెలవు పెట్టడంతో పాఠశాల మూతపడింది.

ఇక్కడ ప నిచేస్తున్న ఉపాధ్యాయులు ఇద్దరు ఉపాధ్యాయులు వివిధ కారణాలతో సెలవు పెడుతు న్నట్లు ముందస్తుగా స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ కు చెప్పగా, గిరిపురం ప్రైమరీ స్కూల్లో పనిచేస్తు న్నా ఓ ఉపాధ్యాయున్ని ఒకరోజు డిప్యూటేషన్ పై ఈ పాఠ శాలకు పంపించారు. సదరు ఉపాధ్యాయులు పాఠశాల సమయం ముగిసేం త వరకు సాయంత్రం నాలుగు గంటల వర కు ఇక్కడే విధులు నిర్వహించాల్సి ఉండగా మధ్యాహ్నం రెండు గంటలకే వెళ్లిపోవడంతో మధ్యాహ్న భోజన ని ర్వాహకురాలు పాఠశాల విద్యార్థులకు కాపలాగా ఉన్నారు.

పేద విద్యార్థులకు సక్రమంగా విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యా యులు ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అస్తవ్యస్తంగా మారడంతో పాటు పేద విద్యార్థులకు చక్కగా విద్యాబుద్ధులు నేర్పే పరిస్థితి లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ పట్ల నిర్ల క్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం

పాఠశాలకు డిప్యూటేషన్ పై పంపించిన ఉపాధ్యాయుడు సమయపాలన పూర్తి అయ్యేంతవరకు పాఠశాలలో వి ధులు నిర్వహించాల్సి ఉంటుందని, అ లా కాకుండా మధ్యలో పాఠశాల వదిలితే చర్యలు తప్పవని ఎంఈఓ అనితా దేవి తెలిపారు. వెంకంపాడు పాఠశాల నిర్వహణ విషయంలో విచారణ జరిపి నిర్లక్ష్యం వహించినట్లు తెలితే చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు.

ఎంఈఓ అనితాదేవి