19-11-2025 12:33:37 AM
సబ్సిడీ ఇవ్వని ప్రభుత్వం
జహీరాబాద్, నవంబర్ 18 :ప్రతి వ్యక్తి ఆలుగడ్డ రుచి ఎరుగని వారు ఉండరు.. ప్రతి రోజు కూరగాయల్లో ఒకటైన ఆలుగడ్డ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీనిని పం డించే రైతుకు మాత్రం ప్రతి సంవత్సరం చే దు అనుభవమే ఎదురవుతుంది. ఆలుగడ్డ పండించే రైతులకు సబ్సిడీపై విత్తనాన్ని ప్ర భుత్వం సరఫరా చేయకపోవడంతో మధ్య దళారుల వద్ద కొనుగోలు చేసి పంట వేయ డం వల్ల ధర రాక నష్టాల భారిన పడుతున్నా రు.
ఈ ఆలుగడ్డ సీజన్లో మొదటగా ఆలుగడ్డ విత్తనం 50 కిలోల బస్తా రూ.850 నుండి రూ.1000 వరకు కొనుగోలు చేశారు. ఆలుగడ్డ ఇచ్చిన తర్వాత వర్షాలు అధికంగా పడడంతో వేసిన పంట మొలకెత్తగా ఆలు విత్తనం మొరిగిపోయింది. దీంతో రైతులు చేసేది ఏం లేక కొత్తగా మళ్లీ దుక్కిని చదును చేసి ఆలుగడ్డ విత్తనాన్ని నాటారు. ఈసారి మాత్రం విత్తనం కొనుగోలు చేయాలంటే 50 కిలో బస్తా రూ.1600 వరకు కొనుగోలు చేసి ఆలుగడ్డ పంటను వేశారు.
ఆలుగడ్డ మాత్రం అతి తక్కువ కాలంలో చేతికి వచ్చే పంట కావడంతో రైతులు ఈ పంటపై ఎక్కు వ ఆసక్తి చూపుతున్నారు. జహీరాబాద్ ని యోజకవర్గంలో కోహిర్ మండలంలో అధికంగా ఆలుగడ్డ పంటను పండిస్తుంటారు. ఝరాసంగం, న్యాల్కల్, మొగుడంపల్లి, జ హీరాబాద్ మండలాల్లో 50 శాతం రైతులు ఆలుగడ్డను పండిస్తుంటారు. ఆలు రైతులకు ఈ సంవత్సరం మాత్రం పంట దిగుబడి ఎలా వస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
పంట వచ్చే సమయంలో మార్కెట్లో ధర ఏవిధంగా ఉంటుందని ఎదురుచూస్తున్నా రు. ముఖ్యంగా ఈ పంటను ఉద్యానవ శాఖ కింద ఇవ్వవలసిన సబ్సిడీలు అందకపోవడంతో రైతులు తమ సొంత ఖర్చుతోనే ఆలు గడ్డను పండిస్తున్నారు.
ఎకరాకు రూ.35వేల పెట్టుబడి...
ఒక్క ఎకరం ఆలుగడ్డ పండించడానికి దాదాపుగా 35 వేల నుండి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆలుగడ్డ పంట వచ్చే సమయానికి హైదరాబాద్ మార్కెట్లో ధర ఉన్నట్లయితే కొద్దిపాటి లాభాలు వస్తా యి తప్ప మార్కెట్లోకి ఎక్కువ ఆలుగడ్డ రావ డం వల్ల ధర పడిపోవడంతో రైతులు ఆవేద న గురవుతారు. అధిక పెట్టుబడులు పెట్టి పంటను పండించినప్పటికీ లాభాలు రాకపోవడంతో రైతులు నష్టాల బారిన పడుతు న్నారు.
దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం ఆలుగడ్డ విత్తన స్టోరేజీని జహీరాబాద్ ప్రాం తంలో నెలకొల్పాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఆ పని ఎండమావిగానే మిగిలిపోతుంది. రా జకీయ పార్టీలు మారుతున్నాయి తప్ప ఆలు రైతుల గోస మాత్రం వినిపించుకున్న దాఖలాలు లేవు. ఈ సంవత్సరం ఆలుగడ్డలు రెం డుసార్లు విత్తడం వల్ల రైతుకు ఎకరాకు రూ. 60 వేల నుండి 70 వేల ఖర్చు వచ్చింది.
ప్ర భుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ విత్తనాన్ని నిల్వ ఉంచే స్టోరేజీలను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. స్టోరేజీలు ఏర్పాటు చేయకపోతే ఆగ్రా, జలంధర్ నుండి వచ్చే ఆలుగడ్డ విత్తనానికి రైతులకు సబ్సిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.