08-04-2025 12:00:00 AM
ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు ల సెలవులపై రాద్ధాంతం చేయడం ఆందోళనకరమైన విషయం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడానికి పభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే, ప్రపంచంలో అన్ని దేశాలకం టే రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఎక్కువ సెలవులు ఉన్నాయన్నారు. కేవలం 180 రో జులు మాత్రమే ఉపాధ్యాయులు పని చేస్తున్నారని వివరించారు. అయితే, ఇక్కడ ప్రభు త్వం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రపంచంలో అన్ని దేశాలకంటే ముఖ్యంగా రష్యా, స్వీడన్, స్విట్జర్లాండ్ దేశాల్లోని ఉపాధ్యాయుల సెలవులతో పోల్చితే రాష్ట్రంలోని ఉపాధ్యాయులకే సెలవులు తక్కువ.
రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు వెకేషనల్ డిపార్ట్‌మెంట్, నాన్ వెకేషనల్ డిపార్ట్‌మెంట్ అని రెండు విభాగాలుగా విభజించి ఉంటా యి. పాఠశాల విద్యాశాఖ వెకేషనల్ డిపార్ట్‌మెంట్ కిందకు వస్తుంది. వేసవి సెలవులు కేవలం విద్యార్థులకే అనే విషయాన్ని ప్రభు త్వ పెద్దలు గుర్తించాలి. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు 30 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. రాత్రిపూట వి ధులు నిర్వర్తిస్తారనే కారణంతో పోలీసులకు వేతనంతో కూడిన సెలవులను 45 రోజులు ఇస్తారు. అదే ఉపాధ్యాయుల విషయానికి వ స్తే వేతనంతో కూడిన సెలవులు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. మిగతా ఉద్యోగుల మా దిరిగా 30 రోజులపాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఉపాధ్యాయులకు వేసవి సెలవు ల్లో పదవ తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంక నం, జనాభా లెక్కలు వంటి అనేక విద్యేతర పనులు ఉంటాయనే విషయం చాలామంది గుర్తించరు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అం శం ఏంటంటే, ఇతర ప్రభుత్వ ఉద్యోగులకం టే ఉపాధ్యాయులకు జీతం విషయంలో ఎ టువంటి అదనపు ప్రయోజనాలూ ఉండవు. నాయకులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు ఇలా పెద్దపెద్ద హోదాల్లో పని చేస్తున్న వారు ఎవరైనా సరే చిన్నప్పుడు ఉపాధ్యాయుల దగ్గర పాఠాలు నేర్చుకున్న వారే అన్న సంగతి మర్చిపోయి సెలవుల గురించి మాట్లాడటం సరికాదు.
రాష్ట్రంలో కామన్ స్కూల్ విధానాన్ని అ మలు చేస్తే అనేక ప్రయోజనాలు కలుగుతా యి. కిందిస్థాయి ఉద్యోగుల నుంచి చట్టసభ సభ్యుల పిల్లల వరకు అందరూ ఒకే రకమైన పాఠశాలల్లో చదవడం వల్ల ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేస్తున్న తరుణంలో కామన్ స్కూల్ విధానంపై దృష్టి కేంద్రీకరిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
- డాక్టర్ ఎస్. విజయభాస్కర్