calender_icon.png 16 July, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాలిన్ నిర్ణయం చారిత్రాత్మకం

08-04-2025 12:00:00 AM

కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ప్రపంచానికి అందించిన జర్మన్ తత్త్వవేత్త కార్ల్ మార్క్ ్స విగ్రహాన్ని తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల శాసనసభలో ప్రకటించడం హర్షణీయం. ఆయన చేసిన ఆ ప్రకటన ప్రజల సమతా భావన ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నది. హేతువాదానికి ప్రతీకగా నిలిచిన ద్రవిడ నేలపై ఆ మహానుభావుని విగ్రహాన్ని నెలకొల్పడం గర్వించదగ్గ విషయం.

నేడు దేశంలో అసమానతలతో ప్రజలను అసహనానికి గురిచేస్తున్న రాజకీయాలను సమూలంగా నేలమాలిగం  చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమిళ నేలలో ద్రవిడ, కమ్యూనిస్ట్ ఉద్యమాలు సమాంతరంగా ముందుకు సాగుతున్నాయి. సమష్టి పోరాటాల ద్వారా ఉద్యమిస్తే సమానత్వం సిద్ధించి సమసమాజం ఆవిర్భవిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ తరుణంలోనే స్టాలిన్ ద్రవిడ సిద్ధాంతంతోపాటు  మార్క్సిస్ట్ సిద్ధాంతానికి ఎనలేని ప్రాధాన్యాన్ని కల్పిస్తూ ముందుకు సాగడం ప్రశంసనీయం.

ప్రపంచ చరిత్ర గతిని మార్చిన కొద్దిమంది వ్యక్తులలో  కార్ల్ మార్క్ ్స మేటి వ్యక్తి. ఆయన అందించిన సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా అనేక విప్లవాలకు దారితీశాయి. మానవాళి ఇప్పటి వరకు ఆయన సిద్ధాంతాల ఆధారంగా అనేక మార్పులకు పునాదులను వేసింది. ‘ప్రపంచ కార్మికులారా! ఏకం కండి. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంకెళ్లు తప్ప..’ అనే గొప్ప నినాదాన్ని మార్క్ ్స అందించడం ద్వారా కార్మికులందరినీ ఏకం చేయడం ద్వారా అందరికీ బాసటగా నిలిచారు. మార్క్స్ గొప్ప విజనరీ కల తాత్వికుడు. ‘కార్మికులు గెలవడానికి ఒక తమదైన ప్రపంచం ఉందనే విశ్వాసాన్ని కలిగించడంలో ఆయన సఫలమయ్యారు’ అని స్టాలిన్ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రసంగం కొనియాడదగింది. తమిళనాట ఇదొక చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుంది. ‘భారతదేశంలో గతంలో రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ సామాజిక,- రాజకీయ పరిస్థితులు ఏ మాత్రం మారనప్పటికినీ భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో దేశం ఆయా మార్పులకు ఆలంబనగా నిలిచి, ఆదర్శ నమూనాగా నిలువనుంది’ అని స్టాలిన్ ప్రత్యేకంగా కార్ల్ మార్క్స్‌ను ఉటంకిస్తూ పేర్కొనడం బావుంది. 

- జె.జె.సి.పి. బాబూరావు 

మరో అద్భుతం పాంబన్ కొత్త వంతెన

భారతదేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనగా పాంబన్ కొత్త వంతెన నిలువడం యావత్ దేశ ప్రజలకే గర్వకారణం. తమిళనాడులోని రామేశ్వరం భూభాగానికి వెళ్లే సందర్శకుల కోసం సుమారు వందేళ్ల క్రితం నిర్మితమైన పాత వంతెనే ఒక అసాధారణ మానవ కట్టడం అనుకుంటుంటే, ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతలతో ఏర్పాటైన నూతన బ్రిడ్జి మరో సంచలనం. ఇది ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిపెడుతున్నది.

 సహర్ష, సికిందరాబాద్