08-04-2025 12:00:00 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల (మార్చి 28న) విడుదల చేసిన ‘జీవో నెంబర్ రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది ‘ఆయుష్ సర్వీస్ రూల్స్’ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. 2005 నుంచి పని చేస్తున్న 62 మంది ఉద్యోగులను వెంటనే తొలగించాలని చూస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం పునఃపరిశీలించాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2005 నుంచి 62 మంది ఆయుష్ కంపౌండర్స్ కాంట్రాక్టు ప్రాతిపదికన అప్పటి ‘కంపౌండర్ సర్వీస్ రూల్స్’కు అనుగుణంగా 10వ తరగతి అర్హతతో, ఆ తర్వాత సవరించిన ఇంటర్మీడియట్ వి ద్యార్హతతో (ఆయుష్) కంపౌండర్ సాం క్షన్డ్ పోస్ట్స్‌లలో ట్రెజరీద్వారా వేతనాలు పొందుతూ వస్తున్నారు. ఒక సంవత్సరం ఇన్ సర్వీస్ ట్రైనింగ్ (ఆయుర్వేద/హోమియో/ యునాని) పొందిన సర్టిఫికెట్ తో గత 20 ఏళ్ల నుంచి ఆయు ష్ డిపార్ట్మెంట్‌లో వారు పని చేస్తున్నారు. కాగా, 2017లో అంతకు ముందు ఉన్న ఉద్యోగ అర్హతలను సవరిస్తూ, కంపౌండర్ అనే పేరును ఫార్మసిస్ట్‌గా మార్చారు.
ఇకపై జరిగే ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్ట్‌కు విద్యార్హతగా 2 సంవత్సరాల ఆయుష్ డిప్లొమా ఫార్మసీ కోర్స్ (ఆయుర్వేద/ హోమియో/ యునాని) ఉంటుందని నిర్ణయించారు. ఈ మేరకు ‘జీవో నెంబర్ 147’ని ప్రభు త్వం విడుదల చేసింది. కానీ ఆ ఆయుష్ డిప్లొమా కోర్స్‌ను 2017 నుంచి 2025 వరకు ఎక్కడా అటువంటి దానిని ఉమ్మ డి ఏపీలో కానీ, ప్రస్తుత తెలంగాణలో కాని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలోనూ కోర్స్‌గా ప్రవేశపెట్టలేదు. ఈ మేరకు ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోర్స్ ప్రవేశ పెట్టమని వినతిపత్రాల ద్వారా కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు.
అసంబద్ధ నిర్ణయం
ఇప్పుడు జాబ్ క్యాలెండరు ప్రకారం ఆయుష్ ఫార్మసిస్ట్ 308 పోస్ట్స్‌ని అల్లోపతిలో 2 సంవత్సరాల డిప్లొమా (డీ ఫార్మసీ / బీ ఫార్మసీ/ పార్మా డీ) చేసిన అభ్యర్థులను మాత్రమే అర్హులుగా చేస్తూ ‘జీవో నెం.65’ని విడుదల చేశారు. వాళ్లకి సర్వీస్‌లోకి వచ్చిన తరువాత ఆయుష్ డ్రగ్స్‌పై 6 నెలల ట్రైనింగ్ ఇస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది. ఎన్‌సీఐఎస్‌ఎం (నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్) రూల్స్‌కి వ్యతిరేకంగా ఆయుష్ సిస్టమ్‌లోకి అల్లోపతి వాళ్ళని అర్హులుగా చేస్తూ ప్రభుత్వం అసంబద్ధ నిర్ణయం తీసుకోవడం అన్యాయం. దీనివల్ల గత 20 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగంలో పని చేస్తున్న 62 మంది ఆయుష్ కంపౌండర్స్ (ఫార్మసిస్ట్) వెంటనే ఉద్యోగాన్ని కోల్పో యే ప్రమాదం ఏర్పడింది. వారి కుటుంబాలు 20 సంవత్సరాల సర్వీస్ తరువాత రోడ్డున పడే పరిస్థితిని ప్రభుత్వం తీసుకు వచ్చింది. కనీసం నోటిఫికేషన్ ద్వారా జరిపే పరీక్షకి కూడా వారు అర్హత కోల్పోవాల్సి రావడం దురదృష్టకరం.
అదే విధంగా ఎన్‌హెచ్‌ఎం స్కీమ్‌లో కాంట్రాక్టు పద్ధతిలో 2008 నుంచి 2025 వరకు గత 18 సంవత్సరాలుగా పని చేస్తున్న 275 మంది ఆయుష్ ఫార్మసిస్ట్(కంపౌండర్ )లు 308 రెగ్యులర్ ఆయుష్ ఫార్మసిస్ట్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కి అర్హులు కాకుండా పోతున్నారు. సర్వీస్ వెయిట్ ఏజ్ 20 మా ర్కుల అర్హత కూడా కోల్పోతున్నారు. వా రంతా జీవితాంతం కాంట్రాక్టు ఉద్యోగిగానే కొనసాగేల పరిస్థితులు తయార య్యాయి. వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
ఆ జీవోను రద్దు చేయండి!
ఇలా మొత్తం 337 మంది పొట్టకొట్టడం అన్యాయం. ఆయుష్ వైద్య వి ధానం, అల్లోపతిక్ విధానం వేరువేరుగా ఉన్నప్పటికీ, దేశంలో ఏ ఇతర రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆయుష్‌లోకి అల్లోపతిని ప్రవేశపెట్టడం దారుణం. వంద లాది మంది కుటుంబాలను రోడ్డున పడేసేలా తీసుకున్న ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సి ఉంది. ఆ ‘జీవో వెంటనే రద్దు చేయడం కా నీ లేదా సవరిచండం కాని చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా వారందరి పక్షాన కోరుతున్నాం. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయం కోసం న్యాయ స్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితిని ప్ర భుత్వం కల్పించిందని కాంట్రాక్టు ఆయు ష్ ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మానవతా దృక్పథంతో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో వాల్సిందిగా విజ్ఙప్తి చేస్తున్నాం.
జి.రంజిత్, ఎం. శంకర్ అధ్యక్ష కార్యదర్శులు, ‘తెలంగాణ ఫార్మసిస్ట్ (కంపౌండర్) వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ