26 July, 2026 | 11:20 PM

ఉపాధ్యాయుల పదోన్నతులు చేపట్టాలి

30-05-2024 01:49 AM

రామచంద్రాపురం, మే 29: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వెంటనే చేపట్టాలని టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ రాజారెడ్డి డిమాండ్ చేశారు. టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం రామచంద్రాపురం మండల వనరుల కేంద్రం వద్ద జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాఠశాలల బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది కొరత లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ నాయకులు పోచయ్య, సురేశ్ కుమార్, విద్యాసాగర్, జనార్దన్, శ్రీనివాస్, వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.