కవితకు మరోసారి చుక్కెదురు
3న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశం
చార్జిషీటులో ఉన్న నిందితులందరికీ సమన్లు
న్యూఢిల్లీ, మే 29: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటుపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కవితపై దాఖలైన చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. అందులో పేర్కొన్న నిందితులందరూ జూన్ 3వ తేదీన కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. దీంతో జూన్ 3వ తేదీన కవితను జైలు అధికారులు కోర్టు ముందు హాజరుపర్చనున్నా రు.
విచారణకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు ఎదుట ఈడీ చేసిన వాదనలను విన్న ప్రత్యేక న్యా యమూర్తి జస్టిస్ కావేరీ బవేజా తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా చార్జిషీటును పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయమూర్తి ప్రక టించారు. కాగా, కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో మంగళ వారం వాదనలు పూర్తయ్యాయి. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు.






