పారిస్‌కు భారత పారా అథ్లెట్ల బృందం
తొలి బ్యాచ్‌లో సుమిత్ సహా 16 మంది
న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో పాల్గొనేందుకు భారత్ నుంచి తొలి పారా అథ్లెట్ల బృందం పారిస్‌కు బయల్దేరింది. జావెలిన్ స్టార్ సుమిత్ అంటిల్ నేతృత్వంలోని 16 మందితో కూడిన మొదటి బ్యాచ్ బుధవారం పారిస్ ఫ్లుటై ఎక్కింది. స్థానిక హోటళ్లో విడిది చేయనున్న ఈ బృందం ఆగస్టు 25న ఒలింపిక్స్ విలేజ్‌లోకి అడుగుపెట్టనుంది. ఆగస్టు 28న పారాలింపిక్స్ ప్రారంభం కానుండగా.. ఫ్రాన్స్‌లోని చాంప్స్ ఎలీసీస్ నుంచి ప్రఖ్యాత ప్లేస్ డి లా కాన్‌కోర్డ్ వరకు ప్రారంభోత్సవ వేడుకలు జరగనున్నాయి.
సెప్టెంబర్ 8న జరగనున్న ముగింపు వేడుకలకు ప్రఖ్యాత స్టేట్ డి ఫ్రాన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఇక భారత్ తరఫున పతాకధా రులుగా సుమిత్ అంటిల్, భాగ్యశ్రీ జాదవ్‌లు వ్యవహరించనున్న సంగతి తెలి సిందే. ఈసారి పారాలింపిక్స్‌కు భారత్ నుంచి 12 క్రీడాంశాల్లో 82 మంది అథ్లె ట్లు బరిలోకి దిగనున్నారు.
ఇక వారం ముందే అడుగుపెట్టనున్న మన అథ్లెట్ల బృందం స్టేట్ డి ఫ్రాన్స్‌కు 5 కిమీ దూరంలోని నెల్సన్ మండేలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రత్యేక శిక్షణ తీసుకోనుంది. ‘ఈసారి పారాలింపిక్స్‌లో ఎక్కువ సంఖ్యలో పతకాలు సాధించాలని టార్గెట్‌గా పెట్టు కున్నాం’ అని పారా అథ్లెటిక్స్ హెడ్‌కోచ్ సత్యనారాయణ పేర్కొన్నారు.






