11 May, 2026 | 7:56 PM

కమాన్ నీరజ్

22-08-2024 12:30 AM
  1. లుసాన్నే డైమండ్ లీగ్ బరిలో భారత స్టార్ 
  2. నేడు అర్థరాత్రి 12.22 గంటల నుంచి

లుసాన్నే: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్ లో రజతం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత స్టార్ అథ్లెట్  నీరజ్ చోప్రా లుసాన్నే డైమం డ్ లీగ్‌లో బరిలోకి దిగుతున్నాడు. భారత కాలామాన ప్రకారం గురువారం అర్థరాత్రి మొదలుకానున్న ఈవెంట్‌లో నీరజ్ ఫేవరెట్‌గా కనిపిస్తున్నాడు. సెప్టెంబర్ 14న జరగ నున్న బ్రస్సెల్స్ డైమండ్ లీగ్ ఫైనల్ గెలిచి ట్రోఫీ అందుకోడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ సీజన్ డైమండ్ లీగ్ మీటింగ్ సిరీస్ ఫైనల్ ఆడాలంటే అథ్లెట్లు టాప్ కచ్చితంగా ఉండాల్సిందే. అయితే నీరజ్ ప్రస్తుతం ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మే 10న దోహా డైమండ్ లీగ్‌లో నీరజ్ రెండో స్థానం లో నిలిచాడు.

బ్రస్సెల్స్ ఫైనల్‌కు ముందు సెప్టెంబర్ 5న జురిచ్ డైమండ్ లీగ్‌లోనూ నీరజ్ పాల్గొనే అవకాశముంది. ఇక పారిస్ విశ్వక్రీడల్లో జావెలిన్ త్రో ఫైనల్లో బరిసెను నీరజ్ 89.45 మీ దూరం విసిరి రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన పాకిస్థాన్ స్టార్ అర్షద్ నదీమ్ ఈ టోర్నీకి దూరంగా ఉండడంతో నీరజ్‌పై భారీ అంచనాలున్నాయి. నీరజ్‌తో పాటు పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన పీటర్స్ అండర్సన్,  జాకుబ్ వద్లెక్, జులియన్ వెబర్, జులి యస్ యోగో, అండ్రియన్ మర్దరే, రోడ్రిక్ జెంకీ , లస్సీ ఎటిలటాలో, ఆర్థర్ ఫెల్నర్, మతుసెవిసియస్ పోటీలో ఉన్నారు.

90 మీటర్లు అందుకునేనా?

పారిస్ ఒలింపిక్స్‌లో 90 మీటర్ల దూరం అందుకుంటాడనుకున్న నీరజ్ తృటిలో తన టార్గెట్‌ను మిస్సయ్యాడు. జావెలిన్‌ను 89.45 మీటర్లు విసిరి ఒలింపిక్స్ బెస్ట్ నమో దు చేసుకున్న నీరజ్ కెరీర్ బెస్ట్ మాత్రం 89.94 మీటర్లుగా ఉంది. 2022 స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ మీట్‌లో నీరజ్ ఈ ఫీట్‌ను సాధించాడు. అయితే 90 మీ టార్గెట్ మాత్రం నీరజ్‌కు అందని ద్రాక్షలానే మిగిలిపోయింది. ఇప్పటికే అర్షద్ నదీమ్ ఒలింపి క్స్‌లో 90 మీటర్ల మార్క్‌ను అందుకోగా.. 93.07 మీటర్లు విసిరిన పీటర్స్ అండర్సన్  నీరజ్‌కు సవాల్‌గా మారనున్నాడు.

లుసాన్నే మీట్‌లో 90 మీటర్ల మార్క్‌ను నీరజ్ అందుకోవాలని ఆశిద్దాం. నీరజ్ చోప్రా తన తల్లిని ఉద్దేశించి సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ‘నేను వెయి ట్ లిఫ్టింగ్ ట్రైనింగ్‌కు వెళ్లినప్పుడు మా అమ్మను అక్కడికి తీసుకెళ్లేవాడిని. కఠిన శిక్షణలో భాగంగా నేను ఎక్కువ బరువులు ఎత్త డం చూసి అమ్మ బాధపడేది. తక్కువ బరువులు ఎత్తాలని సూచించింది. ఆమె బాధను చూడలేక శిక్షణ కేంద్రానికి తీసుకురావడం మానేశాను. ఏ తల్లి అయినా పిల్లలు ఎక్కువగా కష్టపడకూదని కోరుకుంటుంది.. నా తల్లి కూడా నేను పడుతున్న బాధ చూడలేకపోయేది’ అని నీరజ్ చెప్పుకొచ్చాడు.