calender_icon.png 16 October, 2025 | 8:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు జట్టు ఎంపిక

16-10-2025 01:23:54 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,అక్టోబర్ 15(విజయ క్రాంతి)::  తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల , కళాశాలలో బుధవారం  స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-17 వాలీబాల్ బాలికల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు.పోటీలను ఎస్ జి ఎఫ్ జిల్లా సెక్రటరీ బి. వెంకటేష్  అశ్రమ పాఠశాలల క్రీడా అధికారి మాడవి షేకు కలిసి ప్రారంభించారు. పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 48 మంది క్రీడాకారులు హాజరయ్యారు.

వీరిలో మంచి ప్రతిభ కనబర్చిన 12 మందిని జిల్లా జట్టుగా ఎంపిక చేశారు.ఈ జట్టు అక్టోబర్ 18 నుండి 20వ తేదీ వరకు మహబూబ్నగర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.ఈ కార్యక్రమంలో పీడీ పి.ఇ.టిలు భవిత, లక్మన్, శ్రీనివాస్, సుభాష్, రామ్మోహనరావు, బ్రహ్మము, గాజుల శ్రీనివాస్, ఖేలో ఇండియా కోచ్ కడతల రాకేష్, లక్ష్మీ, నాగమణి, ఫుట్బాల్ కోచ్ రవి, సత్యనారాయణ పాల్గొన్నారు.