16-10-2025 01:22:52 AM
-జిల్లాలో మద్యం టెండర్ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ విస్తృత ప్రచారం
-స్థిరాస్తి బడా వ్యాపారులను కలుస్తున్న అధికారులు
-ఈసారి 40 కోట్ల వరకు ఆదాయంపై దృష్టి
-సిండికేట్ చేసుకుంటున్న వ్యాపారులు
నిర్మల్, అక్టోబర్ 15 (విజయక్రాం తి): రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా మద్యం దుకాణాల కేటాయింపుకు టెండర్ల ఆదాయంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2025 27 సంవత్సరం గాను జిల్లాలో 47 మద్యం షాపులకు టెండర్ల ప్రక్రియను ఈనెల 18 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
టెండర్ల దాఖలకు మరో నాలుగు రోజులు గడువు ఉన్నప్పటికీ ఇప్పటివరకు కేవలం 4 మాత్రమే దరఖాస్తు లు రావడంతో ఎక్సైజ్ అధికారులు ఆ సంఖ్య ను పెంచుకునే విధంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. నిర్మల్ జిల్లాలో నిర్మల్ బైంసా ఖానాపూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో మొత్తం 47 మద్యం దుకాణాలకు టెండర్లను ఆహ్వానిస్తుంది. ఇందులో గౌడులకు ఐదు ఎస్సీలకు రెండు ఎస్టీలకు ఒకటి రిజర్వేషన్ కేటాయించ గా మిగతా 39 షాపులో ఓపెన్ టెండర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.
ఈనెల ఒకటి నుం చి టెండర్ దరఖాస్తులను ప్రభుత్వం ఆహ్వానించగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఎక్సైజ్ సీఐ సర్కిల్ పరిధిలో నామమాత్రపు దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం ఈ సంఖ్యను పెంచే విధంగా ఎక్సైజ్ శాఖ సిబ్బందిని రంగంలో దించింది. రండి బాబు రండి.. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోండి మంచిత నం మించితే రాదు. ఎక్సైజ్ మద్యం దుకాణం వల్ల మద్యంపై రాయితీలను వివరించి మద్యం వ్యాపారంతో ఆర్థికంగా అభివృద్ధి చెందిన వారి గురించి తెలిపి టెండర్లు పాల్గొనేలా ఎక్సైజ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు
ఆదాయం పెంపుపై అవగాహన...
నిర్మల్ జిల్లాలో నూతన మద్యం పాలసీ టెండర్ల ప్రక్రియ నత్త నడకన సాగుతుందని తో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలో దిగి ఎక్కువ టెండర్లు వచ్చే విధంగా క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ని నిర్మల్ ఖానాపూర్ బైంసా సర్కిల్ పరిధిలోని 47 మద్యం దుకాణాలకు గత ఏడాది 1067 దరఖాస్తుల రాగా 21 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు.
గత ఏడాది మద్యం దుకాణాలకు టెండర్లు పాల్గొనాలంటే రెండు లక్షల ఉండేది. ప్రభుత్వం ఈసారి ఆ డిపాజిట్ ను మరో లక్ష రూపాయలు పెంచి మూడు లక్షలకు చేర్చింది. మూడు లక్షలు బ్యాంకు డిడి చెల్లించి ప్రభుత్వం కేటాయించిన నంబర్ షాప్ కు దరఖాస్తు చేసుకుంటే టెండర్ పూర్తయిన తర్వాత లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు.
ఎంపికైన వారికి రెండు సంవత్సరాల పాటు ఆ మద్యం దుకాణం నడిపించుకోవడానికి అనుమతి ఇస్తారు.ప్రభుత్వం ఈసారి రెండు లక్షల రెండు మూడు లక్షల పెంచడంతో ఒకవేళ షాపు లక్కీ డ్రా లో రాణి పక్షంలో ఆ డిపాజిట్ మొత్తం ప్రభుత్వ ఖాతాలో జమ కానుంది దీంతో కొందరు మద్యం వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి మద్యం దుకాణాలకు నంబర్ల వారీగా సామూహిక టెండర్లను వేసి ఎందుకు రహస్య ఒప్పంద పత్రాలను రాసుకుంటున్న ట్టు సమాచారం. ఇది జరుగుతే మద్యం దుకాణాలకు దరఖాస్తులు తగ్గుతాయి ప్రభుత్వ ఆదానికి గండిపడే అవకాశం ఉంది
విస్తృత ప్రచారం చేస్తున్న అధికారులు
నూతన మధ్య పాలసీ నేపథ్యంలో ప్రభు త్వ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఎక్సైజ్ అధికారులు ఈసారి విన్నుతున్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. జిల్లాలో జిల్లా వ్యాప్తంగా గత మూడు సీజన్లలో మద్యం టెండర్ల కోసం దరఖాస్తు చేసుకొని షాపులు పొందిన షాపులు పొందని జాబితాను రూపొందించుకొని వారిని కలిసి టెండర్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
ఏ షాపులో ఎంత మద్యం విక్రయాలు జరుగుతాయో వచ్చే కమిషన్ వ్యాపార లాభాలు తదితర అంశాలపై వ్యాపారులు సిండికేట్లు రియల్ ఎస్టేట్లు పెట్టుబడిదారులను కలిసి విన్నవిస్తూ టెండర్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. లక్కీ డ్రా కావడంతో అదృష్టం మీదే వరించబోతుందంటూ నమ్మకంగా చెప్పి షాపు లక్కీ డ్రా లో వస్తే దాన్ని ఇతరులకు అమ్మడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. మద్యం వ్యాపారంతో సంబంధం లేని వారిని సైతం పలుకుబడి ఆర్థిక బలమున వారి వద్దకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు.
ఈసారి 1500 పైగా దరఖాస్తులు స్వీకరించి సుమారు 40 కోట్ల ఆదాయం రాబట్టుకునే విధంగా ఎక్సైజ్ శాఖ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పట్టణాల్లో ప్రచారం చేస్తూ మిత్రులు ఉద్యోగులు ఇతర వ్యాపారం కలిసి చర్చిస్తున్నారు. టెండర్ల ప్రక్రియ ఈనెల 18న ముగియనున్న నేపథ్యంలో మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడం వల్ల ఎక్సైజ్ అధికారులు ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు రాబట్టుకునే విధంగా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. ఇప్పటివరకు కేవలం 50 వరకు దరఖాస్తు మాత్రమే రాగా బుధవారం నుంచి ఆ సంఖ్య ప్రతిరోజు వందలు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
గత సీజన్లో టెండర్లు వేసి నిరాశ నిష్కులకు గురైన వారు 3 లక్షల డిపాజిట్ నేపథ్యంలో కొంత వెనుకడుగు వేస్తున్నప్పటికీ మరో ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి టెండర్లు వేకిల్స్ ఎందుకు ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. ఈనెల 18 వరకు టెండర్లు స్వీకరించిన అధికారులు 23న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లక్కీ డ్రా షాపులను కేటాయించగా వచ్చేనెల ఒకటి నుంచి మద్యం విక్రయాలకు వారికి అనుమతి ఇవ్వనున్నారు ఈ ప్రక్రియను జోరుగా నిర్మించుకున్నందుకు జిల్లా యంత్రాంగా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ప్రయోజనాలు చెకుస్తాయో కాలమే నిర్ణయించాలి
ఊపందుకున్న మద్యం టెండర్లు
మంచిర్యాల, అక్టోబర్ 15 (విజయక్రాంతి): జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలోని 73 ఏ4 మద్యం దుకా ణాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ మందకొడిగా సాగింది. ఈ నెల 18వ తేదీతో దరఖాస్తులకు ఆఖరి తేదీ కావ డంతో బుధ వారం మంచి రోజు కావడంతో ఒక్క రోజే 88 దరఖాస్తులు వచ్చాయి.
ఇప్పటి వరకు జిల్లాలో మంచిర్యాల ఎక్సైజ్ సర్కిల్లో 54 దరఖాస్తులు రాగా, బెల్లంపల్లిలో 37, లక్షెట్టిపేటలో 34, చెన్నూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 14 దరఖాస్తులు, మొత్తం 139 దరఖాస్తులు వచ్చాయి. మంచిర్యాల జిల్లాలో మద్యం టెండర్లకు దరఖాస్తుల ప్రక్రియను బుధవారం డిప్యూటీ కమిషనర్ రఘురాం సందర్శించి పరిశీలించారు. దరఖాస్తులకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను సమిక్షించారు. ఆయన వెంట జిల్లా మద్యపాన నిషేద అధికారి నంద గోపాల్, మంచిర్యాల ఎక్సైజ్ సీఐ గురువయ్య తదితరులున్నారు.