04-08-2025 01:19:04 PM
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి విజయవాడకు(Delhi to Vijayawada) రావాల్సిన ఎయిర్ విస్తారా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి విస్తారా విమానంలో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ప్రయాణికులు మూడున్నర గంటలపాటు రన్ వేపై విమానంలో కూర్చొన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సిబ్బంది విమానం నుంచి కిందకి దింపి పాసింజర్ లాంజ్ కు తరలించారు. విస్తారా యాజమాన్యం ఇప్పటివరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పైలట్ టేకాఫ్(Pilot takeoff) సమయంలో అకస్మాత్తుగా వేగం తగ్గించి పక్కకు తప్పించారు. ఎన్నిసార్లు అడిగినా సిబ్బంది సరిగా స్పందించలేదని ప్రయాణికులు ఆరోపించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్(Justice Battu Devanand) విస్తారా విమానంలో ఉన్నారు. విమాన సిబ్బంది నిర్లక్ష్య ప్రవర్తనపై జస్టిస్ దేవానంద్ స్పందించారు. ఆహారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమాచారం లేదని ప్రయాణికులు తెలిపారు. జస్టిస్ దేవానంద్ గట్టిగా అడగడంతో టెర్మినల్ లోకి ప్రయాణికులను తరలించారు. తమకు పైనుంచి ఎలాంటి సమాచారం లేదని సిబ్బంది తెలిపారు. విమానంలో సుమారు 160 మందికిపైగా ప్రయాణికులున్నారు. కనీసం సమాచారం లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.