04-08-2025 02:22:09 PM
కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలుసాని తిరుపతిరావు
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ ప్రజలకు బూటకపు హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు పోలుసాని తిరుపతిరావు అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పోలుసాని తిరుపతిరావు హాజరై మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ముద్ర లోన్లు,ఇంటింటికి ఎల్ఈడి బల్బులు,ఐదు వందే భారత్ రైల్లు,ఉజ్వల యోజన గ్యాస్ లు,సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ వంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు.