04-08-2025 01:39:19 PM
వసూళ్ళ దందాకు పాల్పడిన ఘటనపై నిర్ణయం.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ల పేరుతో వసూళ్ల దందాకు పాల్పడిన ఇద్దరు సిబ్బందిని విధుల్లో నుండి తొలగించగా పర్యవేక్షణ లోపంతో పాటు వసూళ్ల దందాలో కూడా వాటాలు ఉన్నట్లుగా అనుమానిస్తూ అధికారులు ప్రిన్సిపల్(Minority Gurukul Principal Suspended) సుంకన్నకు మెమో జారీ చేశారు. మరింత లోతుగా విచారించిన అధికారులు సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న కరీం అనే టీచర్ కి ప్రిన్సిపల్ ఇన్చార్జి అదనపు బాధ్యతలను అప్పగించారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కంప్యూటర్ ఆపరేటర్ ముస్తాక్, వార్డెన్ దర్వేష్ లు డబ్బులు డిమాండ్ చేసిన ఘటనపై విజయక్రాంతి ఈనెల 2న 'మైనారిటీ గురుకులంలో వసూళ్ల దందా" అనే శీర్షిక వార్తా కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.