calender_icon.png 4 August, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం

04-08-2025 02:14:55 PM

రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యంతో ముందుకు

అంతర్జాతీయ ఫార్మా కంపెనీలకు గమ్యస్థానంగా హైదరాబాద్

హైదరాబాద్: అమెరికాకు చెందిన లిల్లీ ఫార్మా కంపెనీని( Lilly Pharma Company) గచ్చిబౌలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అనువైన వాతావరణం ఉందని చెప్పారు. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారని తెలిపారు. రైజింగ్ తెలంగాణ-2047(Telangana Rising 2047) లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని శ్రీధర్ బాబు సూచించారు. రాష్ట్రంలో ఫార్మా కంపెనీలకే ప్రత్యేకమైన జో నోమ్ వ్యాలీ ఉందన్నారు. మెడ్ టెక్నాలజీకి రాష్ట్రం ప్రత్యేకమైన హబ్ గా ఎదుగుతోందని మంత్రి శ్రీధర్ బాబు వివరించారు.

అంతర్జాతీయ ఫార్మా కంపెనీలకు హైదరాబాద్ గమ్య స్థానంగా ఉందని చెప్పారు. హైదరాబాద్ లో అత్యాధునికమైన కమాండ్ కంట్రోల్ సెంటర్(Command Control Center) ఉందని తెలిపారు. ఏఐ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఐటీ మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ లో ఇప్పటికే చాలా అంతర్జాతీయ సంస్థలున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు జత కలవడం సంతోషకరం అన్నారు. పరిశ్రమలకు, పెట్టుబడులకు స్నేహపూర్వక వాతావరణం కల్పించామన్నారు. గత 19 నెలల్లో తెలంగాణ రూ. 3.2 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించిందని మంత్రి వివరించారు. కొత్త పెట్టుబడుల సాధనలో గుజరాత్, తమిళనాడు తర్వాత తెలంగాణ నిలిచిందని చెప్పారు. జీనోమ్ వ్యాలీ, మెడ్ టెక్ పార్కును మరింత విస్తరించే ప్రణాళికలతో ఉన్నామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.