calender_icon.png 4 August, 2025 | 4:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్

04-08-2025 01:40:31 PM

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై పలు పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులను కొట్టాయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని పలు పీఎస్ లలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఒకే ఘటనపై వేర్వేరు పీఎస్ లలో కేసులు పెట్టారని, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా కేసులు నమోదు చేశారని ఆయన న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు.  ఇప్పటి వరకు నమోదైన కేసులపై స్టే విధించి, అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని, మధ్యంతర పిటిషన్ ఇవ్వాలని కోరారు. న్యాయవాది వ్యాఖ్యలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి అన్ని పిఎస్ లలో నమోదైన కేసులపై స్టే విధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది.