04-08-2025 02:15:07 PM
వనపర్తి,(విజయక్రాంతి): అదనపు కలెక్టర్ రెవెన్యూ విధులు నిర్వహిస్తున్న జి. వెంకటేశ్వర్లు ఫ్యూచర్ సిటీకి బదిలీ అయినందున ఆయన స్థానంలో కొత్తగా వచ్చిన ఎన్. ఖీమ్యా నాయక్ సోమవారం వనపర్తి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టారు. కొత్తగా వచ్చిన అదనపు కలెక్టర్ కు పరిపాలన అధికారి భాను ప్రకాష్ పుష్ప గుచ్చం తో స్వాగతం పలికారు.