10 March, 2026 | 7:30 AM

మహిళా గోల్ఫర్లకు టీగోల్ఫ్ ఫౌండేషన్ టోర్నీ

10-03-2026 01:12 AM

హైదరాబాద్, మార్చి 9 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టీ గోల్ఫ్ ఫౌండేషన్ మహిళా గోల్ఫర్ల కోసం ప్రత్యేకంగా ఇన్విటేషనల్ టోర్నీ నిర్వహించింది. మహిళా గోల్ఫర్ల ప్రాతినిథ్యం పెంచడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ టోర్నీకి అనూహ్యమైన స్పందన వచ్చింది.

0 హ్యాండిక్యాప్, 13 హ్యాండిక్యాప్, 27 పిన్, స్ట్రెయిట్ డ్రైవ్, లాంగ్ డ్రైవ్, జూనియర్ గరల్స్, సబ్-జూనియర్ గరల్స్, 9-హోల్ గోల్ఫ్ టోర్నమెంట్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. తెలంగాణ యువ గోల్ఫర్ అమూల్య గ్రాస్ విన్నర్ గానూ, డాక్టర్ శ్వేత గ్రాస్ రన్నరప్‌గా నూ నిలిచారు. ఒలింపియన్, వరల్డ్ నెం.10 షూటర్, అర్జున అవార్డు గ్రహీత ఇషా సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

మహిళా దినోత్సవం రోజున గోల్ఫ్‌లో ఇలాంటి ప్రత్యేకమైన టోర్నీ నిర్వహించడం నిజంగా అభినందనీయమని ఇ షాసింగ్ వ్యాఖ్యానించింది. గోల్ఫ్ లో మహిళల ప్రాతినిథ్యం మరింత పెంచే ఉద్దేశంతో టీ గోల్ఫ్ ఫౌండేషన్ వారి కోసం ప్రత్యేకంగా టోర్నీలు నిర్వహిస్తున్నట్టు డాక్టర్ ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా లెవల్ ఎ సర్టిఫైడ్ గోల్ఫ్ కోచ్ అయిన శ్రీమ తి ఇంద్రాణి పెండెకంటి  ఇటీవల హైదరాబాద్ ఓపెన్ గెలిచిన అమూల్యకు రూ.90 వే ల ప్రైజ్ మనీ చెక్కును అందజేశారు.