గిరిజన సంస్కృతికి నిదర్శనం తీజ్ వేడుకలు
23-07-2025 10:47 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనంగా తీజ్ వేడుకలు నిలుస్తాయని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) అన్నారు. కేసముద్రం మండలం పరిధిలో బిచ్య నాయక్ తండాలో తీజ్ పర్వదిన వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి, గిరిజనులందరికి తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.






