31 August, 2026 | 1:31 AM

ఇంజాపూర్‌లో ఘనంగా తీజ్ వేడుకలు

31-08-2026 12:00 AM

పాల్గొన్న ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఆదిభట్ల, ఆగస్టు 30 (విజయక్రాంతి):  ఆ దిభట్ల సర్కిల్ పరిధిలోని ఇంజాపూర్లో బం జారా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీ జ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బంజారా మహిళల కోరిక మేరకు ఎమ్మెల్యే గోధుమ మొలకల బుట్టను నెత్తిన పెట్టుకున్నారు.మహిళలతో కలిసి ఆయన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లు, తీజ్ పాటలతో కార్యక్రమం సందడిగా సాగింది.

బంజారా మహిళలు సంప్రదాయ నృత్యాలతో అలరించారు.బంజారాల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. భావితరాలకు సంప్రదాయాలను అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఇంజాపూర్లో బంజారాల కోసం నిర్మించనున్న హాల్కు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. వేడుకల్లో బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో నాయకులు గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, కళ్యాణ్ నాయక్, రమేష్ నాయక్, తదితరులు  పాల్గొన్నారు.