31 August, 2026 | 2:32 AM

మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్

31-08-2026 01:23 AM
  1. నేటి నుంచి స్కూల్ బ్రేక్ ఫాస్ట్ ప్రారంభం...
  2. 3 జిల్లాల్లోని 17 మండలాల్లో 49 వేల విద్యార్థులకు...
  3. 691 ప్రభుత్వ పాఠశాలలకు, 13 జూనియర్ కాలేజీలకు సరఫరా...
  4. రూ 8 కోట్ల సింగరేణి సీఎస్సార్ ఫండ్స్ తో ఏర్పాటు...
  5. ఆటోమేటెడ్ మిషన్లతో 2 రెండు గంటల్లోనే తయారీ...
  6. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ

మంచిర్యాల, ఆగస్టు 30 (విజయక్రాంతి) : విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలకు వెళ్లకుండా, ఆరోగ్యకరమైన అల్పాహా రంతో ఉత్సాహంగా విద్యను అభ్యసించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం లో భాగంగా మంచిర్యాలలో సెంట్రలైజ్డ్ క మ్యూనిటీ కిచెన్ను ఈనెల 31వ తేదీన ప్రా రంభించనున్నారు.

జిల్లా కేంద్రంలోని కాలే జ్ రోడ్ లో గల మెడికల్ గోడౌన్ ప్రాంగణం లో సింగరేణి సంస్థ కమ్యూనిటీ సోషల్ రె స్పాన్సిబిలిటీ (సీ ఎస్ ఆర్) కింద రూ. 8 కోట్ల నిధులతో 8 వేల చదరపు అడుగుల వి స్తీర్ణంలో ఆధునిక యంత్ర పరికరాలతో

ఈ కిచెన్ నిర్మించగా హరే కృష్ణ మూవ్మెంట్ చా రిటబుల్ ఫౌండేషన్ అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన ఆ హారం అందించడంతో పాటు ఆహార నా ణ్యత, పరిశుభ్రత, భద్రతా ప్రమాణాలను అ త్యున్నత స్థాయిలో నిర్వహించేందుకు ఫుడ్ ల్యాబ్, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి ప్రత్యేక సదుపాయాలను సైతం ఏర్పాటు చేశారు.

మూడు జిల్లాల్లోని 17 మండలాలకు సరఫరా...

ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని 17 మండలాల వి ద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడి అల్పాహారం అందించనున్నారు. మం చిర్యాల జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, జన్నారం, మందమర్రి, లక్షెట్టిపేట, దండేపల్లి, కాసిపేట, నెన్నెల, హాజీపూర్, నస్పూర్, భీ మారం మండలాలతో పాటు జగిత్యాల జి ల్లాలోని వెల్గటూరు, ఎండపల్లి మండలాలు,

పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, అంతర్గాం, పాలకుర్తి మండలాల్లోని 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42, 450 మంది విద్యార్థులకు, అలాగే 13 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 6,654 మం ది విద్యార్థులకు ప్రతిరోజూ బ్రేక్ఫాస్ట్ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమై న వాతావరణంలో, అత్యున్నత నాణ్యతా ప్ర మాణాలను పాటిస్తూ అల్పాహారం అందించడం ద్వారా స్కూల్ బ్రేక్ఫాస్ట్ ప్రోగ్రాం వి ద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది.

ఆటోమేటెడ్ మిషన్లతో వేగంగా తయారీ...

ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ లో ఆ ధునిక సదుపాయాలతో అధునాతన ఆటోమేటెడ్ మిషన్ల ద్వారా వేలాది మంది విద్యా ర్థులకు ప్రతిరోజూ పరిశుభ్రమైన వాతావరణంలో, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించనున్నారు. ఆటోమేటెడ్ స్టీమర్లతో గంటకు 5,600 ఇడ్లీలు, ఆటోమేటిక్ దోశ మెషీన్తో గంటకు 2 వేల దోశలు, ఆటోమేటిక్ పూరీ మెషీన్తో గంటకు 3,600 పూరీలు త యారు కానున్నాయి.

సాంబార్, కూరల త యారీ యూనిట్ల ద్వారా రెండు గంటల్లో 5 వేల మంది విద్యార్థులకు సరిపడా ఆహారం, రైస్ కుకింగ్ పరికరాల ద్వారా కేవలం 40 ని మిషాల్లో వెయ్యి మందికి సరిపడా అన్నం త యారు చేయగల సామర్థ్యం ఉంది. అలాగే ఆటోమేటిక్ వెజిటబుల్ వాషింగ్ అండ్ క టింగ్ యూనిట్, ఆర్ ఓ వాటర్ ప్లాంట్, బా యిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, వ్యర్థ నీటిశుద్ధి ప్లాంట్ (ఈటీపీ), వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసే వ్యవస్థ తదితర ఆదునిక సదుపాయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.

మెనూ ప్రకారం సరఫరా...

17 మండలాల్లోని విద్యార్థులకు సమతుల్యమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం అందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ న్యూట్రిషన్ సూచనల మేరకు సోమ వారం నుంచి శని వారం వరకు మెనూను రూపొందించారు. విద్యార్థులు ఉదయం పూట ఆకలితో పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు వెళ్లకుండా, ఆరోగ్యకరమైన పోషకా హారంతో కూడిన అల్పాహారం తీసుకుని ఉ త్సాహంగా విద్యను అభ్యసించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకొని రూపొందించిన మెనూ ఇలా ఉంది...సోమవారం: ఇడ్లీ, సాంబార్,మంగళవారం: పూరీ, ఆలూ కుర్మ, బుధ వారం: దోశ, చట్నీ,గురువారం: ఉప్మా, చ ట్నీ,శుక్రవారం: మిల్లెట్ ఇడ్లీ, సాంబార్,శనివారం: బోండా, చట్నీ

నేడు ప్రారంభం...

మంచిర్యాల అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లోని మెడికల్ గోడౌన్ లో నిర్మించిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను ఈ నెల 31న ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల ఎ మ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావుతో పా టు కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య, హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ (HKMCF) ప్రెసిడెంట్, ది అక్షయ పాత్ర ఫౌండేషన్ రీజినల్ ప్రెసిడెంట్ హిస్ గ్రేస్ సత్య గౌర చంద్ర దాస స్వామీజీ, తదితరులు హాజరుకానున్నారు.