15 April, 2026 | 4:16 PM

సింగర్ మంగ్లీ వివాదంపై పంజాగుట్ట సీఐ స్పష్టత

14-04-2026 01:10 AM

పంజాగుట్ట, ఏప్రిల్ 13(విజయక్రాంతి): సింగర్ మంగ్లీ, అడ్వకేట్ సుబ్బుల మధ్య జరుగుతున్న వివాదంపై పంజాగుట్ట సీఐ రామకృష్ణ స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ ఇప్పటి వరకు మంగ్లీకి సంబంధించి ఎలాంటి ఫైనాన్స్ స్కాం ఫిర్యాదులు తమకు అందలేదన్నారు. బాధితులెవరూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి రారని స్పష్టం చేశారు.

కేవలం మంగ్లీ తనను బెదిరించారంటూ అడ్వకేట్ సుబ్బు ఇచ్చిన ఫిర్యాదుపైనే ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్ నమోదైందన్నారు. అయితే దీనిపై విచారణ కొనసాగుతుండగానే ఆదివారం సింగర్ మంగ్లీ కూడా అడ్వకేట్ సుబ్బుపై ఎదురు ఫిర్యాదు చేశారని ఆయన వెల్లడించారు. రెండు ఫిర్యాదులను పరిశీలిస్తున్న క్రమంలో సోమవారం అడ్వకేట్ సుబ్బు తిరిగి పోలీస్ స్టేషన్కు వచ్చారని సీఐ తెలిపారు.

ఆ సమయంలో సుబ్బు దగ్గర నుంచి ఆల్కహాల్ వాస న రావడంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా తాను వెంటనే ఆల్కహాల్ టెస్టుకు ఆదేశించానని పేర్కొన్నారు. పరీక్షలో సుబ్బుకు 27 ఎంజీ ఆల్కహాల్ శాతం నమోదైనట్లు నిర్ధారణ అయిందన్నారు. మద్యం సేవించి ఉండటంతో ఆయన స్టేషన్ వద్ద మీడియా సమక్షంలో హంగామా సృష్టించారని సీఐ వివరించారు. ప్రస్తుతం ఈ రెండు పరస్పర ఫిర్యాదులపై పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారన్నారు. కేవలం వ్యక్తిగత దూషణలు, బెదిరిం పుల కోణంలోనే ఈ కేసు విచారణ సాగుతోందని, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుం టామని స్పష్టం చేశారు.