అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు: డీజీపీ
13-12-2025 03:55 PM
ఉప్పల్,విజయక్రాంతి: కోల్‌కతా ఘటన నేపథ్యంతో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వద్ద అదనపు బలగాలను మోహరించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. 'కోల్‌కతా ఘటన తర్వాత మరోసారి ఏర్పాట్లపై సమీక్షించాం. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, గ్రౌండ్లోకి ఫ్యాన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మెస్సీ 7.15PMకి స్టేడియానికి వస్తారు. మ్యాచ్ 20min జరుగుతుంది. చివరి 5minలో సీఎం, మెస్సీ మ్యాచ్ ఉంటుంది' అని తెలిపారు.






