13-12-2025 03:52:08 PM
ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించిన ఆలయ సిబ్బంది, అర్చకులు
పాపన్నపేట,విజయక్రాంతి: రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాతను శనివారం ఎలక్షన్ అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు, సిబ్బంది వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, అర్చకులు శంకర శర్మ తదితరులు ఉన్నారు.