28-11-2025 12:27:58 AM
హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి) : ఇండస్ట్రీయల్ లాండ్స్ ట్రాన్స్‌ఫ ర్మేషన్ (హిల్ట్ ) పాలసీపై బీఆర్‌ఎస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. పాలసీ అర్థం కాక ఈ ప్రచారం చేస్తున్నారో..? కావాలని చేస్తున్నారో..? తెలియడంలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకే ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది ఆకస్మికంగా తెచ్చిన పాలసీ కాదని మంత్రి చెప్పారు.
ల్యాండ్ స్కాం జరుగుతోందని బీఆర్‌ఎస్ చేసిన ఆరోపణలను మంత్రి ఉత్తమ్ ఖండించారు. ఓ పెద్దమనిషి తాము వస్తే పాలసీ మారుస్తామని అంటున్నారని, కానీ వారు మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదు.. పాలసీ మార్చబోయేది లేదు..? అని బీఆర్‌ఎస్‌కు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ విషయంలో రూ. 50 వేల కోట్లు కాదు కదా, రూ. 50 వేల రూపాయల కుంభకోణం కూడా జరగలేదన్నారు.
గురువారం ఆయన గాంధీభవన్‌లో.. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, పార్టీ నేతలు సంగిశెట్టి జగదీష్, ఓబీసీ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, బొల్లు కిషన్, గజ్జి భాస్కర్ తో కలిసి మీడియతో మాట్లాడారు. పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకి పంపాలనే డిమాండ్ పాతదేనని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో కూడా ఈ పాలసీపై చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని, అలాంటి పరిస్థితి హైదరాబాద్‌కు రా కూడదని ప్రభుత్వం భావిస్తోందన్నారు.
ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్ష పా ర్టీలు చేసే ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని మంత్రి పేర్కొన్నారు. ఇండస్ట్రియల్ పా లసీ రూపకల్పనలో తాను భాగంగా ఉన్నానని, కొత్త ఇండస్ట్రియల్ పాలసీతో రాష్ట్రానికి అదనపు ఆదాయం వస్తుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలనే ఉద్దేశ్యంతోనే ఈ రకంగా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు.
ఇండస్ట్రీ పాలసీలో కుంభకోణానికి ఆస్కారమేలేదని, చాలా పారదర్శమైన పాలసీ తీసు కువచ్చామన్నారు. 2014 విభజన చట్ట ప్రకా రం ఎన్టీపీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో 4 వేల మెగా వాట్ల పవర్ పాంట్ ఏర్పాటు చేస్తామని చెబితే అవి ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్దమనుషులు జవాబు చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఇండియా బుల్ అనే కంపెనీ దగ్గర ఉపయోగంలో లేని ఎక్విప్మెంట్ ఎం దుకు కొనుగోలు చేసింది..? భద్రాద్రి ప్రా జెక్టు అవుట్ డేటెడ్ టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఏముంది..? అని ఆయన నిలదీశారు.
భద్రాద్రి ప్రాజెక్టు అనవసరంగా తెలం గాణ ప్రజలపై రుద్దిన ప్రాజెక్టు అని అన్నారు. ఈ భద్రాద్రి కొత్తగూడెం పవర్ ప్రాజెక్టు పెద్ద కుంభకోణమన్నారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకంపై జరుగుతున్న వివాదంపై మీడియా ప్రశ్నించగా.. మంత్రి సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఇది పార్టీ అంతర్గత విషయమని, బ యట మాట్లాడనని తెలిపారు.