3 June, 2026 | 1:35 AM

అమరుల త్యాగంతోనే తెలంగాణ ఆవిర్భావం

03-06-2026 12:10 AM

ఘనంగా ఆవిర్భావ వేడుకలు

ఆయా జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రులు సీతక్క, పొంగులేటి, కొండా సురేఖ

మహబూబాబాద్, జూన్ 2 (విజయక్రాంతి): అమరుల త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర కల నెరవేరిందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ లు డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, బిర్ల ఐలయ్య, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ వేడుకలు మంగళవారం హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆత్మ బలిదానాలకు పాల్పడ్డ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించిన ముఖ్య అతిథులు, జాతీయ పతాకాలను ఆవిష్కరించి జండా వందనం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి, మహిళా సంక్షేమానికి, ఇతర రంగాల అభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. అమరవీరుల కుటుంబాలను సన్మానించారు. వివిధ సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.

ఛాంబర్ ఆధ్వర్యంలో.. 

వరంగల్, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భాన్ని పురస్కరించుకొని, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో ఛాంబర్ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమ శ్వాస, సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్, ఛాంబర్ పూర్వ కార్యదర్శి స్వర్గీయ భూపతి కృష్ణమూర్తి చిత్రపటాలకు పుష్పమాలలు సమర్పించి, వారి పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ ఘన నివాళులు అర్పించారు.

ప్రత్యేక తెలంగాణ సాధనలో వరంగల్ ఛాంబర్ వ్యాపారస్తులు, గుమస్తాలు, దడువాయి, ఎడ్లబండ్ల కార్మికులు, హమాలీ కార్మిక సోదరులందరూ నాడు ప్రాణప్రదంగా ఉద్యమించారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ మాజీ అధ్యక్షులు తుమికి రమేశ్ బాబు, కటకం పెంటయ్య, మొగిలి చంద్రమౌళి, మడూరి వేద ప్రకాష్, సాగర్ల శ్రీనివాస్, అల్లె సంపత్, ఛాంబర్ కార్యవర్గ సభ్యులు, ఛాంబర్ అన్ని సెక్షన్ల గౌరవ అధ్యక్ష, కార్యదర్శులు, వర్తక, వ్యాపార రంగాల ప్రముఖులు, కార్మికులు పాల్గొన్నారు.

అబ్దుల్ నాగారంలో..

జనగామ, జూన్ 2 (విజయక్రాంతి): రా ష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తరిగొప్పు ల మండలం అబ్దుల్ నాగారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భోగ శీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో జాతీ య జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం పార్టీ జెండాను ఆవి ష్కరించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ భాష బోయిన రాజు, మూల రమేష్, భాష బోయిన పరశురాము లు, మూల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రంలో..

కేసముద్రం, జూన్ 2, (విజయక్రాం తి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఆవిర్భావం కోసం ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ గంట సంజీవరెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వివేక్, మండల పరిషత్ లో ఎంపీడీవో క్రాంతి, మున్సిపాలిటీలో చైర్ పర్సన్ బానోత్ సునీత, పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ క్రాంతి కిరణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.