భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
02-06-2026 06:29 PM
మధిర,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మధిరలోని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పిటిసి సూరంశెట్టి నాగభూషణం జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
నాయకులు మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు.






