24 March, 2026 | 9:52 PM

సెప్టెంబర్ 17న సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

14-09-2024 02:53 PM

హైదరాబాద్: వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విగ్రహాల నిమజ్జన ఊరేగింపు సందర్భంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాల్లోని జంట నగరాలు, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు/పాఠశాలలు/కళాశాలలకు సెప్టెంబర్‌ 17న సెలవు అని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.