ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్
- 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.
- గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులు సైతం క్లియర్.
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) గురువారం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య బిల్లుల బకాయిలు మంజూరు చేసింది. 04-03-2023 నుండి 20-06-2025 వరకు పెండింగ్‌లో ఉన్న రూ.180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను విడుదల చేయడం జరిగిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) ప్రకటించారు. బకాయిలు చెల్లింపుతో 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట లభించింది. గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులు(Pending bills) సైతం క్లియర్ చేసినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని క్లియర్ చేశామని డిప్యూటీ సీఎం(Deputy CM) స్పష్టం చేశారు.






