ధరణి పోర్టల్ నిర్వహణ ఎన్ఐసీకి అప్పగింత
22-10-2024 12:07 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ధరణి పోర్టల్ నిర్వహణను తెలంగాణ ప్రభుత్వం ఎన్ఐసీకి అప్పగించింది. మూడేళ్ల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఐసీ పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పొడిగిస్తామని ఒప్పందలో వెల్లడించింది. ధరణి పోర్టల్ నిర్వహణను ప్రైవేట్ సంస్థ టెరాసిస్ నుంచి ఎన్ఐసీకి బదలాయించింది. సాంకేతిక అంశాల్లో ఎన్ఐసీకి సహకరించాలని టెరాసిస్ ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ధరణిలో ఉన్న లోతుపట్లను తెలపాలని, ఎన్ఐసీకి సహకరించేందుకు వచ్చే నెలాఖరు వరకు టెరాసిస్ కు గడువు ఇచ్చింది.






