18 June, 2026 | 6:43 PM

రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే

18-06-2026 05:22 PM

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి కోట్లు కుమ్మరించిన రాయదుర్గం భూముల వేలంపై(Raidurg land Auction) తెలంగాణ హైకోర్టు(Telangana High Court ) స్టే ఇచ్చింది. 3 మూడు వారాలపాటు స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు(High Court Orders) జారీ చేసింది. 3 వారాల్లోపు కౌంటర్ దాఖాలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశించింది. వేలం వేసిన భూమి తమదేనంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(State Bank of India) హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2015లో ఐదు ఎకరాల భూమిని ఎస్బీఐకి రాయితీపై టీజీఐఐసీ కేటాయించింది. ఇన్నోవేషన్, డేటాసెంటర్ నిర్మాణం కోసం ఎస్బీఐకి కేటాయించింది. టీజీఐఐసీ(TGIIC) ఎస్ బీఐకి చెందిన భూమిని ఇటీవలే వేలం వేసింది. వేలంలో ఎకరా భూమి ధర రూ, 237 కోట్లు పలికింది. వేలం రద్దు చేసి భూమిని తమకే కేటాయించాలని ఎస్బీఐ హైకోర్టులో పిటిషన్ వేసింది. 2010లో టీజీఐఐసీతో ఎస్బీఐ(SBI) ఒప్పదం కుదుర్చుకుందని ఏఏజీ తెలిపారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేసేలా ఎస్బీఐ ఒప్పందం కుదుర్చుకుందని కోర్టుకు ఏఏజీ వివరించారు.

16 ఏళ్లు అయినా నిర్మాణమే ప్రారంభం కాలేదని అదనపు అడ్వకేట్ జనరల్(Additional Advocate General) పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం భూమిపై పూర్తి హక్కు టీజీఐఐసీకే చెందుతోందని ఏఏజీ స్పష్టం చేసింది. భూమిని ఏ కారణంతో వేలం వేశారు? స్థిరాస్థి వ్యాపారాన్ని పరుగులు పెట్టించాలనుకున్నారా? అని న్యాయమూర్తి  ఏఏజీని ప్రశ్నించారు. భూమి వేలం వేసి ఆ డబ్బులను ప్రజాశ్రేయస్సు కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఏఏజీ న్యాయమూర్తికి సూచించారు. మరోచోట భూమి తీసుకునేందుకు ఎస్బీఐ అంగీకరించిందని న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఎస్బీఐ అధికారులు చందనవల్లి భూమిని పరిశీలించారని నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మాటమారుస్తూ భూమి తమకే ఇవ్వాలంటూ కోర్టుకెక్కారని నిరంజన్ వివరించారు. కౌంటర్ దాఖలు చేసే వరకు మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వొద్దని నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. డబ్బులు కట్టించుకున్న తర్వాత ఆ భూమి ఎస్బీఐకే చెందుతుంది కదా? అని న్యాయమూర్తి వెల్లడించారు. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయనందున భూమి టీజీఐఐసీకే చెందుతోందని అదనపు ఏజీ పేర్కొన్నారు.