18-09-2025 01:29:27 AM
త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి సలహాదారు
వేం నరేందర్ రెడ్డి ఉత్సాహభరితంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
నిజామాబాద్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించిన ఆయన, జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజనుద్దేశించి ప్రసంగించారు. వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. ప్రజాపాలన దినోత్సవం వేడుక సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. సిద్ధార్థ కళాక్షేత్ర, నవీపేట, కంజర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బాలికలు, బోర్గాం (పి) ఉన్నత పాఠశాల, డిచ్పల్లి మానవతా సదన్ చిన్నారులు చూడ చక్కని నృత్యాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు చూరగొన్నారు.
ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ఆర్.భూపతి రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటంతోనే పల్లెల్లో వెట్టి చాకిరి విముక్తి...
కామారెడ్డి, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి), తెలంగాణ సాయుధ పోరాటంతోనే పల్లెల్లో వెట్టి చాకిరి విముక్తి కలిగిందని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ అభివృద్ధి కమిషన్ చైర్మన్ ఎం కోదండ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవం కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధితో దేశం మొత్తం తెలంగాణ కీర్తి గడించిందని అంటున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని ఆయన అభివర్ణించారు. తెలం గాణలో రజాకార్ల పాలనలోమాతృభాష అణచివేత, మతపరమైన ధోరణులు తొలగి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి మారిందన్నారు. శాంతి సామరస్యాలకు ప్రతీక గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్రం సుస్థిర ప్రజాపాలనతో సంక్షేమాన్ని పంచుతూ అన్ని మతాలను సమానంగా ఆదరిసస్తూ శాంతి, సామరస్యాలకు ప్రతీకగా నిలిచిందన్నారు.
అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలకు స్వర్గధామంగా పేరొందిందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్రప్రభుత్వం ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా వివిధ రంగాల్లో ప్రగతి సాధించిందని తెలిపారు. అంతకుముందు హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ పోరాట అమరులకు కోదండ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ కార్యాలయంలో..
ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి హోదాలో కలెక్టర్ టి విన య్ కృష్ణారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డిప్యూటీ సీఈఓ సాయన్న, సిబ్బంది పాల్గొన్నారు.
బిచ్కుందలో..
బిచ్కుంద, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జుక్కల్ మండల కేద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరించారు.. ఆయన మాట్లాడూతూ.. ఎందరో మహనీయుల త్యాగఫ ం వల్ల రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్లో తెలంగాణ విలీనమైన శుభదినం రోజున జరుపుకుంటున్న ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన.. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరా ట స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం.. ఆనాటి సాయుధ పోరాటం లో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘన నివాళి అర్పించారు. మండ ల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
తాడ్వాయిలో...
తాడ్వాయి, (విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో బుధవారం తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండల తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో తహసిల్దార్ శ్వేత ఎంపీడీవో కార్యాల యం ఆవరణలో ఎంపీడీవో సాజిద్ అలీ కాంగ్రెస్ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి గ్రామ పంచాయతీల ఆవరణలో ప్రత్యేక అధికారులు జెండాలు ఎగరవేశారు. సెప్టెంబర్ 17 న తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. అధి కారులు పార్టీల నాయకులు పాల్గొన్నారు.
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో..
నిజామాబాద్ సెప్టెంబర్ 17:(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాల య ఆవరణలో జాతీయ జెండాను నిజాంబాద్ సిపి సాయి చైతన్య ఆవిష్కరించారు. అనంతరం నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, గౌరవ వందనం స్వీకరిం చారు. పోలీస్ లైన్ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు స్వీట్ ప్యాకెట్స్, నోట్ బుక్స్ లు , పెన్ లు పంపిణీ చేశారు. అదనపు డి.సి.పి ( అడ్మిన్ ) శ్రీ బస్వారెడ్డి , అదనపు డి.సి.పి ఏ ఆర్ రాంచంధర్ రావ్ , సైబర్ క్రైమ్ ఏ.సి.పి వై వెంకటేశ్వర్లు,సి.సి.ఎస్, ఎ.సి.పి నాగేంద్ర చారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం,సి.ఐ లు , ఆర్.ఐ లు , ఎస్.ఐ లు జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది , ఐటి కోర్ , సెంట్రల్ కాంప్లె సెల్,స్పెషల్ బ్రాంచ్, సిసిఆర్బి సైబర్ క్రైమ్ ,పోలీస్ సిబ్బంది పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.