అభివృద్ధిలో దేశం మెచ్చే స్థాయిలో తెలంగాణ
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్ ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): అభివృద్ధిలో దేశం మెచ్చే స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఉందని, అభివృద్ధి, సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు.
మంగళవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని యశోద నరహరి ఫంక్షన్ హాల్ లో సుల్తానాబాద్ మున్సిపల్ తో పాటు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 99 మంది లబ్ధిదారులకు 99,11, 484 (తొంబై తొమ్మిది లక్షల పదకొండు వేల నాలుగువందల ఎనబై నాలుగు రూపాయలు) విలువ గల కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు అందజేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతుందని గత పాలకులు తొమ్మిది సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరికి రేషన్ కార్డు అందించిన పాపాన పోలేదని అన్నారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్ప లత,మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, , తాసిల్దార్ బషీరుద్దీన్,కాంగ్రెస్ నాయకులు వేగోళం అబ్బయ్య గౌడ్, చిలుక సతీష్, పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు,మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు లబ్ధిదారులు పాల్గొన్నారు.




