13-11-2025 01:02:54 AM
సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
బెజ్జంకి బెజ్జంకి నవంబర్ 12:పత్తి రైతులకు ఈ సంవత్సరం అతివృష్టి వల్ల తీవ్ర నష్టం కలిగిందని మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధ వారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామంలోని మణికంఠ పత్తి మిల్లు లో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం చేకూరిందని, చేతికొందిన పంట తీవ్ర వర్ష లతో కొయ్యడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి మిల్లర్లు పత్తి రైతులను ఎలాంటి ఇబ్బందులు గురి చేయకుండా కొనుగోలు చేయాలని సూచించారు.
పత్తి ఎకరానికి 12 క్వింటాళ్లు ఉన్నదాన్ని ఏడు క్వింటలకు తగ్గించడం , పాత పద్ధతిలోనే 12 అమ్ముకొనేల కొనసాగించాలని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి తెలపడ జరిగిందని అన్నారు.తడిసిన వరి ధాన్యాన్ని , సొసైటీలు ఐకేపి సెంటర్లు బాయిల్ మిల్లులకు తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ ,అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, బైరి సంతోష్, ఇస్కిళ్ల ఐలయ్య, మచ్చ కుమార్, మాజీ ప్రతినిధులు బెజ్జంకి మండల రైతులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.