కవిత అరెస్ట్
హైదరాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత(Telangana Jagruthi President Kavitha) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కామారెడ్డిలో రైల్ రోకో నిర్వహించారు. రైల్ రోకోలో జాగృతి కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కవిత రైలు పట్టాలపై బైఠాయించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కవిత చేతికి స్వల్పగాయం అయింది. కవితను అరెస్ట్ చేసిన పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీసీల కోసం పోరాడుతున్న కల్వకుంట్ల కవితను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాకు నీళ్లు రాలే
కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని కవిత ఆరోపించారు. ప్యాకేజీ 21,22 ద్వారా కాంట్రాక్టర్లకే డబ్బులు పోయాయని తెలిపారు. డబ్బులన్నీ కాంట్రాక్టర్లకే పోయాయి తప్ప.. ప్రజలకు మేలు జరగలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం చెబితే బీఆర్ఎస్(BRS) వాళ్లు నా మీద నోరు వేసుకొని పడిపోతారని కవిత సూచించారు. నాపై కుట్ర చేసి నా కుటుంబం నుంచి దూరం చేశారని తెలిపారు. మరో కుటుంబమైనా తెలంగాణ కోసం.. ధైర్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి ద్రోహి బీజేపీ, రెండో ద్రోహి కాంగ్రెస్ అన్నారు. బీసీ రిజర్వేషన్లపై రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద ఆగిపోయాయని కవిత తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) కొడంగల్ పై చూపిన ప్రేమ కామారెడ్డిపై చూపటం లేదని కవిత ఆరోపించారు.




