calender_icon.png 28 November, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజధాని కట్టడం అంటే ఆషామాషీ కాదు

28-11-2025 01:35:44 PM

అమరావతి: అమరావతి అత్యద్భుత రాజధాని(Amaravati Capital) అవుతుందన్న నమ్మకం తనకు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) అన్నారు. రాజధాని కట్టడం అంటే ఆషామాషీ కాదన్న కేంద్రమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఇందుకు సమర్థుడని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణం అవుతుందంటే.. కేవలం రైతుల సహకారంతోనే అన్నారు. 29 వేల మంది రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని తెలిపారు. కేంద్ర సహకారంతో రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశామని నిర్మల వివరించారు. ఇక్కడున్న ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్న ఆమె వచ్చే ఏడాది 3వ లార్జెస్ట్ ఎకానమీగా మారబోతున్నామని వెల్లడించారు. ఏడాదిన్నరలో ఆస్ట్రో ఫిజిక్స్ ప్లానిటోరియం పూర్తవుతుందని తెలిపారు. ఏపీకీ మళ్లీ రాజధాని నిర్మాణం గొప్ప విషయమన్నారు. అరటి, కొబ్బరి రైతుల కోసం తాము ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే కూరగాయల ఎక్స్ పోర్ట్ కు ప్రత్యేక కార్యాచరణ ఉండాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Finance Minister Nirmala Sitharaman) శంకుస్థాపన చేయడంతో ఒక ముఖ్యమైన మైలురాయి చేరుకుంది. శుక్రవారం జరిగిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారాయణ సహా ఇతర ప్రముఖ మంత్రులు హాజరయ్యారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఉన్న సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం మొదటి బ్లాక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని వీక్షించడానికి అమరావతి ప్రాంతం నుండి రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, స్థానిక నివాసితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమరావతిని ఆర్థిక, పరిపాలనా కార్యకలాపాలకు కేంద్ర కేంద్రంగా స్థాపించే దిశగా ఈ శంకుస్థాపన కీలకమైన మొదటి అడుగును సూచిస్తుంది.