calender_icon.png 28 November, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ. 5కే ఆకలి తీరుస్తున్నాం

28-11-2025 12:42:31 PM

హైదరాబాద్: నగరంలోని కవాడిగూడ ఎన్టీపీసీ వద్ద ఇందిరమ్మ క్యాంటీన్( Indiramma Canteen)లను ప్రారంభించి, ఇందిరమ్మ క్యాంటీన్ లో అల్పాహారం చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ గద్వాల విజయ లక్ష్మి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్,ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం లో హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం ఇందిరమ్మ క్యాంటీన్ లలో అల్పాహారం , మధ్యాహ్న సమయంలో భోజనం చేయడానికి ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు.

ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం(Sundarayya Vignana Kendram), కవాడిగూడ ఎన్టీపీసీ వద్ద క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరమో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుంది స్థానిక ప్రజలు ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ సూచించారు. ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం ,భోజనం అందించడం జరుగుతుందన్నారు. దీని ద్వారా హైదరాబాద్ లో ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి మెట్రో పాలిటన్ నగరంలో మౌలిక సదుపాయాలు ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి పొన్నం వివరించారు.