4 June, 2026 | 5:37 PM

తెలంగాణ ఆదర్శ కళాశాల ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపిక జాబితా విడుదల

04-06-2026 04:31 PM

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల మరియు కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన ఎంపిక జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రిన్సిపల్ దుర్గం మహేశ్వర్ తెలిపారు.గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పదో తరగతి మెరిట్‌తో పాటు రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.ఎంపిక జాబితాను ఈ నెల 5వ తేదీ శుక్రవారం పాఠశాల నోటీసు బోర్డులో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఒరిజినల్ టీసీ, బోనాఫైడ్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, పదో తరగతి ఆన్‌లైన్ మార్కుల జాబితా, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, రెండు సెట్ల జిరాక్స్ ప్రతులతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత గడువులోగా ప్రవేశ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో ప్రవేశాలు రద్దు చేయబడతాయని ప్రిన్సిపల్ హెచ్చరించారు.